ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2081 పింగళ
శక సంవత్సరం: 1946 క్రోధి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: వసంత
మాసం: చైత్ర
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: ద్వాదశి రా.10:58 వరకు
తదుపరి త్రయోదశి
వారం: శనివారం – మందవాసరే
నక్షత్రం: పూర్వఫల్గుణి ప.02:43 వరకు
తదుపరి ఉత్తరఫల్గుణి
యోగం: ధృవ రా.02:47 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బవ ఉ.09:58 వరకు
తదుపరి బాలవ రా.10:58 వరకు
తదుపరి కౌలువ
వర్జ్యం: రా.10:38 – 12:24 వరకు
దుర్ముహూర్తం: ఉ.05:56 – 07:32
రాహు కాలం: ఉ.09:05 – 10:40
గుళిక కాలం: ఉ.05:56 – 07:31
యమ గండం: ప.01:49 – 03:24
అభిజిత్: 11:50 – 12:40
సూర్యోదయం: 05:56
సూర్యాస్తమయం: 06:33
చంద్రోదయం: ప.03:47
చంద్రాస్తమయం: రా.03:43
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: సింహం
దిశ శూల: తూర్పు
వామన ద్వాదశి
భర్త్యు ద్వాదశి
శ్రీలక్ష్మి నారాయణ ప్రతిమ
పూజ - దానము
మదన ద్వాదశి
అహోరాత్ర విష్ణు పూజ
శ్రీ మాధవానంద స్వామి
పుణ్యతిథి
భాతృప్రాప్తి వ్రతము
ఆవలియబాబా జయన్తి
దంపతి పూజ
విష్ణు దమనోత్సవం
త్రిస్సూర్ పూరం
( వడక్కునాథర్ ఉత్సవం )
తిరుఉత్తరకోసమంగై
శ్రీ మంగళదేవి ఉత్సవం
శ్రీ మోపర్తి సీతారామారావు
స్మృతి దినం
తిరుక్కన్నపురం విజయ
రాఘవన్ స్మృతి దినం
శుక్ల ద్వాదశి – ఉత్తరఫల్గుణి
యోగం
ధాన్యదానం
నమో గోవింద సర్వేశ
గోపికాజన వల్లభా
అనేన ధాన్య దానేన
ప్రీతో భవ జగద్గురో
నేటి రాశి ఫలాలు
మేషం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.
వృషభం
మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబసభ్యుల సలహాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.
మిధునం
శుభసమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.
కర్కాటకం
తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
సింహం
వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.
కన్య
ఉత్సాహంగా పనిచేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
తుల
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శ్రీసూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం.
వృశ్చికం
కార్యసిద్ధి ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
ధనుస్సు
ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
మకరం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి, అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.
కుంభం
అనుకూల సమయం. తోటి వారి నుంచి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.
మీనం
ప్రారంభించబోయే పనుల్లో అంతా మంచే జరుగుతుంది. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)