రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది.

ఇందులో BRS పాలనలో బడ్జెట్ అంచనాలు, ఖర్చులు, అప్పులు గురించి సభకు తెలియజేయనుంది.

గత పదేళ్లలో బడ్జెట్ అంచనాలు, ఖర్చుకు 20% తేడా ఉన్నట్లు గమనించారని తెలుస్తోంది. 2014లో రూ.75వేల కోట్ల అప్పు ఉంటే గత పదేళ్లలో రూ.6,85,765 కోట్లకు చేరిందని, సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చులో తేడాలు ఉన్నాయని వివరించనున్నట్లు సమాచారం.