మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:7 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

గురువారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో 11 వ జాతీయ చేనేత దినోత్సవాన్ని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముందు మంచిర్యాల జిల్లా లోని హాజీపూర్ మండల్ పడ్తన పెల్లి గ్రామానికి చెందిన చిందం లింగయ్య , అంకం లచ్చయ్య చేనేత కార్మికులకు పూల బోకేలు అందజేసి శాలువతో ఘనంగా సన్మానము చేసారు.

ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ…

చేనేత అంటేనే చైతన్యం అని అలాంటి చేనేత కార్మికులను ప్రభుత్వాలు ఓట్ల కోసం వాడుకుంటున్నాయి తప్ప వారి సంక్షేమం కోసం ఆలోచించిన దాఖలాలు లేవు అని, చేనేత అంటే వృత్తి కాదు అది మన అస్తిత్వం అని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ను విడుదల చేయాలని , చేనేత పై GST రద్దు చేయాలని , జాతీయ చేనేత బోర్డు ను పునరుద్ధరించలని ప్రభుత్వాలను డిమాండ్ చేసినారు.

అదే విధంగా పద్మశాలీయులు చేనేత కార్మికులు , రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలి అని మేమెంతో మకాంత వాట కొరకు రాజ్యాధికారంలో వాటకొరకు తెలంగాణ జాతిపిత చేనేత సహకారోద్యమ పితమహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో పోరాడాలని , రాబోయే సర్పంచ్ ,ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో మన పద్మశాలీయుల సత్తా చాటాలని అన్నారు .
పోగును వస్త్రంగా మలిచి మనిషి మనాన్ని కాపాడేది చేనేత వృత్తి అని , చేనేత వస్త్రాలనే ధరిద్దాం నేత అన్నలకు అండగా ఉందాం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికులకు, మిత్రులకు , శ్రేయోభిలాషులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, జిల్లా BCJAC నాయకుడు గజెల్లి వెంకటయ్య, పడ్తన పల్లి గ్రామ మాజీ సర్పంచ్ అంకం కృష్ణమూర్తి, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అడిచర్ల సాగర్, శ్రీమతి కె. మమత రాణి, సంఘం నాయకులు చెరుకు నారాయణ, చెట్టు పెల్లి లక్ష్మిరాజం, దాసరి మల్లయ్య, చిందం రాజలింగు, తిరుపతి, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…