భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
CPI పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి గారు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది – పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు గారు
సిపిఐ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు బొల్లోజు అయోధ్య చారి గారు ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం. పినపాక నియోజకవర్గం మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అయోధ్య గారు చేసిన సేవలు మరువలేనివి.
వారి మృతి సిపిఐ పార్టీకి తీరని లోటు నాలుగు దశాబ్దాల పాటు ప్రజాహక్కుల కొరకు అలుపెరగని పోరాటాలు చేసిన అయోధ్యగారు ఇక లేరు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. అయోధ్య గారితో నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచి వేసింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా తట్టుకుని ముందుకు సాగాలని నా సానుభూతిని తెలియచేస్తున్నాను.
ఓం శాంతి
మీ
పాయం వెంకటేశ్వర్లు
MLA పినపాక.
ఇవి కూడా చదవండి….
- కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…
- తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 91 వ జయంతి వేడుకలు
- genco లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి…
- BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు BRS పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి
- ప్రముఖ సౌండ్ అండ్ డెకరేటర్స్ అధినేత నంది వీరభద్రం మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
