గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం

Caption of Image.

కోనరావుపేట, వెలుగు :  గుండెపోటుతో  13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామానికి చెందిన చెందిన తాళ్లపల్లి శంకర్, సరితకు యశ్వంత్, సుశాంత్ కొడుకులు. చిన్న కొడుకు సుశాంత్ (13) ముస్తాబాద్ గురుకుల స్కూల్‌‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన సుశాంత్ సోమవారం అస్వస్థతకు గురికాగా సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

 పరీక్షించిన డాక్టర్లు అప్పటికే గుండెపోటుతో చనిపోయాడని నిర్ధారించారు. చిన్నవయసులోనే గుండెపోటుతో చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ అరుణ, వైస్ ఎంపీపీ సుమలత కోరారు. 

©️ VIL Media Pvt Ltd.