దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఇవాళ ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగింది.

రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ మంచు కమ్మేసింది. ఈ కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు పొగమంచుతో పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ `0′ కి పడిపోయింది.