రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ TS RTC డిపోలలో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద నాన్ ఇంజినీరింగ్ విభాగానికి బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ అర్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రీజియన్ వారీగా ఖాళీల వివరాలు…
హైదరాబాద్ రీజియన్‌లో – 26
సికింద్రాబాద్ రీజియన్‌లో – 18
మహబూబ్ నగర్ రీజియన్‌లో – 14
మెదక్ రీజియన్‌లో – 12
నల్గొండ రీజియన్‌లో – 12
రంగారెడ్డి రీజియన్‌లో – 12
ఆదిలాబాద్ రీజియన్‌లో – 9
కరీంనగర్ రీజియన్‌లో – 15
ఖమ్మం రీజియన్‌లో – 9
నిజామాబాద్ రీజియన్‌లో – 9
వరంగల్ రీజియన్‌లో – 14
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు దారుల వయోపరిమితి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్రెంటిస్ శిక్షణ వ్యవధి మూడేళ్లు ఉంటుంది. ఈ అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 16, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000ల చొప్పున ప్రతి నెలా స్టైపెండ్ ఇస్తారు. దరఖాస్తు సమర్పణకు ముందు www.nats.education.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవల్సి ఉంటుంది.