ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ మరో తెలుగు సినిమా లో నటించబోతున్నాడు.

ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ సినిమా ఉందని, త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ ప్రకటించి సమ్మర్ లో షూటింగ్ మొదలుపెట్టి 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా కూడా తెలుగు, తమిళ్ బైలింగ్వల్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది..

అయితే ఇప్పటికే వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రశాంత్ వర్మ, దిల్ రాజు సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఇక విజయ్ సినిమా కూడా బరిలో నిలుస్తుందని సమాచారం.. విజయ్ గత సినిమా వారసుడు లాగే రాబోయే ఈ సినిమా కూడా ఎక్కువగా తమిళ్ మార్కెట్ మీదే ఫోకస్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేయొచ్చు.

ఇదిలా ఉండగా మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం పై రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది.

తమిళనాడు 2026 ఎన్నికల్లో పోటీ చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు విజయ్ తన 68వ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ తెలుగు సినిమా, తర్వాత ఇంకో సినిమా అనౌన్స్ చేయబోతున్నాడు.

మొత్తం 70 సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.