కేరళలో రెండేళ్ల క్రితం బీజేపీ నేత రంజిత్ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించింది మావెలిక్కర అదనపు సెషన్స్ కోర్టు. నిందితులు అందరూ ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన వారు కావడం గమనార్హం.

2021 డిసెంబరు 19న అలప్పుళలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేశారు. పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి.. కుటుంబసభ్యుల ముందే దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఈ దాడిలో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కొందర్ని అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు.. 2024 జనవరి 20న 15 మందిని దోషులుగా నిర్ధారించింది. నేడు తుది తీర్పు వెలువరించింది.

నైసామ్, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం (అలియాస్ సలాం), అబ్దుల్ కలాం, సఫరుద్దీన్, మన్షాద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్ మరియు షెర్నాస్ అష్రఫ్ లు బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్‌ను దారుణంగా హత్య చేసిన దోషులు. వీరందరికి నేడు కేరళ సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది.