నాగార్జున సాగర్ నుండి జగన్ కు నీళ్లు ఇచ్చినందుకా? పది ఏండ్లు అధికారంలో ఉండి కూడా SLBC నీటి కాలువను పూర్తి చేసి, నీళ్లు ఇవ్వనందుకా? మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా సమస్యల సుడిగుండంలో ఉంచినందుకా?అక్షరాన్ని మాత్రమే నమ్ముకుని హైదరాబాద్ లైబ్రరీలల్లో కుర్చీలకు అతుకున్న నల్లగొండ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినందుకా? నల్లగొండ మూసీ నది ఏటి ఇసుక నంత దోచుకున్నందుకా? తక్షణమే నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పి, నల్గొండకు రావాలి. కాంగ్రెస్ ప్రజా పాలన హితం కోరుతూ, స్పష్టమైన తీర్పించి కాంగ్రెస్ కు పట్టం కట్టిన నల్లగొండజిల్లా ప్రజల ముందు నీ ఆటలు సాగవు కేసీఆర్.

చనగాని దయాకర్ గౌడ్ టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓ.యూ. ఉద్యమ నేత.