మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో శివయ్య దర్శనానికి బారులు తీరారు.

వేములవాడ, కొమురవెల్లి, వేయిస్తంభాల గుడి, రామప్ప, కీసర, కాళేశ్వరం తదితర ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం దీక్ష విరమించేందుకు తరలివస్తున్నారు. దీంతో శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.