IIT జోధ్పూర్ లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. JEE అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు.

దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి IITగా జోధ్పూర్ ఐఐటీ నిలిచింది. ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జోధ్పూర్ IIT ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ విద్యావిధానం 2020కింద ఈ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నారు.