రాష్ట్రంలో టీచర్ అభ్యర్థుల నియామకాలపై కీలక అప్డేట్ వెలువడింది. ఈ నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించి రానున్న రెండు నెలల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ క్రమంలోనే రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. ఈ వారమే ఫైనల్ కీ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీలో మెరిట్ అభ్యర్థులను 1:3 రేషియాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు సమాచారం.