రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం నుంచి గురువారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.