బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు.

నేడు సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.