రైతులకోసం కాంగ్రెస్ పార్టీ రణం

టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపుమేరకు, మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి నాయకత్వంలో హన్మకొండ జిల్లా, కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు రైతులకోసం పెద్ద ఎత్తున నిరసన రాస్తారోకో కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ

లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీ అమలుకై..

కౌలు రైతు చట్టం అమలు కోసమై…

పోడు రైతులకు పట్టాలు ఇప్పించుటకై…

అటవీ హక్కుల చట్టం అమలు చేయుటకై…

ధరణి పోర్టల్ మింగిన భూముల లెక్క తేల్చుటకై…

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చేస్తామని, ఇందుకోసం గ్రామ ప్రజలు మండల స్థాయిలో జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.
నిరసన కార్యక్రమం అనంతరం ఎమ్మార్వో కి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి కాజీపేట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయ శ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్లు తొట్ల రాజు యాదవ్, కాంటెస్ట్ కార్పోరేటర్లు సందెల విజయ్ కుమార్, నాయకురాలు మద్దెల శోభ, పిఎసిఎస్ డైరెక్టర్లు, కాజీపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనాయకులు, మహిళా నాయకురాలు, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.