జుట్టు అందాన్ని పెంచడానికి చాలామంది చాలా రకాల చర్యలు తీసుకుంటారు. అయితే కొంతమంది తీవ్రమైన చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతారు. అలాంటి వారు నిమ్మకాయ, పెరుగుతో చుండ్రుని వదిలించుకోవచ్చు. ఈ మిశ్రమం చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు జుట్టు అందాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ, పెరుగును జుట్టుకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

నిమ్మకాయ, పెరుగు ఇంట్లోనే ఉంటాయి. పెరుగులో విటమిన్ సి, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. దీంతో పాటు పెరుగు ప్రోటీన్, కాల్షియం ఉత్తమ మూలం. ఇది జుట్టుకు ప్రొటీన్‌ని అందిస్తుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. పెరుగు, నిమ్మకాయను జుట్టుకి అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. పెరుగులో యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. దీంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది. దీని కోసం పెరుగు, నిమ్మరసం బాగా కలిపి తలకు పట్టించి కాసేపు అలాగే ఉండాలి. ఆ తర్వాత జుట్టు కడగాలి. దీంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది. పెరుగు, నిమ్మరసం జుట్టు రాలే సమస్యను తొలగిస్తుంది. ఇందుకోసం పెరుగు, నిమ్మకాయతో పాటు కొద్దిగా కరివేపాకు జోడిస్తే జుట్టు రాలడం తగ్గిస్తుంది.

hmtv.com