మనిషి జీవితం లో గెలుపు అనేది చాలా ముఖ్యం. మరి ఆచార్య చాణక్య ద్వారా మనిషి జీవితం లో గెలుపు గురించి చెప్పిన విషయాలని చూద్దాం.

నిజానికి ప్రతీ ఒక్కరు కూడా జీవితంలో అనుకున్నది సాధించాలి. అందుకు తగ్గట్టుగా కృషి చేయాలి. లేదంటే ఆ జీవితానికి అర్ధమే లేదు. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాన్ని చూస్తే.. అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు జీవితం కష్టాలమయం అవుతుంది. తను జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించేందుకు అవ్వదు. అలానే చాణక్య మనిషి కి ఉన్న దానితో సంతృప్తి పడాలని చెప్పారు.

ఎవరి రుణం కూడా తీసుకోకూడదు అని అన్నారు. ఒకవేళ కనుక పిల్లల సమక్షంలో చెడుగా ఎవరైనా ప్రవర్తిస్తే .. వారు సంతోషకరమైన జీవితానికి దూరమవుతారు అని చాణక్య చెప్పారు. పైగా తల్లిదండ్రులను గౌరవించని, అబద్ధాలు చెప్పే పిల్లలు లైఫ్ లో సక్సెస్ అవ్వలేరని చెప్పారు చాణక్య. ఇటువంటి ప్రవర్తన కుటుంబంలో సమస్యలను తీసుకు వస్తుందట. ఇంట్లో అందరికీ కూడా శాంతే ఉండదు అని చాణక్య అంటున్నారు.