దేవుడున్నాడా ? పునర్జన్మలు నిజంగా ఉన్నాయా ? అతీత శక్తులు వాస్తవమేనా ? ఇలాంటి ప్రశ్నలు బుద్ధిజీవులైన మానవుల్ని చాలాకాలంగా పీడిస్తున్నాయి . ఈ పురా తనకాల ప్రశ్నలకు తోడుగా ఇంకో ప్రశ్న నాగరిక మానవుల్ని తీవ్రంగా కలవర పెడుతున్నది . ఆ ప్రశ్న ” గ్రహాంతరజీవులు నిజంగా ఉన్నారా ? ఆక్సిజన్ , నీరు , ఉన్నచోటనే ప్రాణులు జీవించగలవు .
ఈ అంశాలు భూగ్రహంపై సమృద్ధిగా ఉండటం వల్లే భూమిపై అనేక రకాల జీవజాలం జీవిస్తున్నది . కానీ కార్బన్ డై ఆక్సైడు వాయువు అధికంగా ఉండే కొన్ని ఇతరగ్రహాల్లో జీవరాశి ఉండే అవకాశముందా ? ఈ ప్రశ్నకు కొండరు శాస్త్రవేత్తలు ఇలా సమాధానమిస్తున్నారు.
మనుషులు , జంతువులు ఆక్సిజన్ వాయువును పీల్చి కార్బన్ డై ఆక్సైడును బయటికి వదులుతున్నారు . ఈ వాయువును పీల్చిన వృక్షాలు ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి .
దేవుడు చేసిన అత్యంత క్లిష్టమైన ఏర్పాటిది . మనిషి , జంతువులు , చెట్లపై ఆధార పడతారు . కార్బన్ డై ఆక్సైడును పీల్చుకున్న వృక్షాలు జీవించగా లేంది అలాంటి ఏర్పాటే కలిగున్న గ్రహాంతరజీవులు తమ గ్రహాల్లోని కార్బన్ డై ఆక్సైడుని పీల్చుకుని జీవించే అవకాశం ఉండొచ్చుకదా ! ఆయితే చాలామంది . శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మన సౌరకుటుంబం లోని ఏ గ్రహాల్లోనూ ( భూమిని మినహాయించి ) జీవులుండే ఆస్కారం లేదని తేల్చి చెబుతు న్నారు .
మరికొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మనిషి నేటివరకూ కనీసం సౌరకుటుంబంలో ఉన్న సూర్యుడిదాకా కూడా వెళ్ళలేకపోయారు అలాంటిది ఈ అనంత విశ్వంలో ఉన్న కోటానుకోట్ల గ్రహాల్లో జీవుల్లేరని ఏ ఆధారాలతో చెప్ప గలం ? ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా చాలా అభివృద్ధి చెందింది . అనేకమైన టీ.వి. ఛానెల్స్ ఉన్నాయి . ప్రపంచంలో ఏమూల ఏంజరిగినా వీడియోతో సహా ప్రపం చానికి ప్రదర్శించగల పరిజ్ఞానం ఏర్పడిది .
ఇంకా “ ఇంటర్నెట్ ” ప్రబలంగా అభివృద్ధి చెందింది . కనుకనే గ్రహాంతరజీవుల వివరాలు , అప్పుడప్పుడూ కనిపించే గ్రహాంతర జీవుల అంతరిక్షనౌకల ( U.E.O ) ఫొటోలు ప్రపంచమంతటా అందించబడుచున్నాయి . నిప్పులేనిదే పొగరాదు అని ఒకపామెత ఉంది .
ఏ ఆధారాలు లేకుండా గ్రహాంతర జీవులు లేరని , ఎవరో పనిలేనివారి కల్పనలని కొందరువ్యక్తులు ఎందుకు వాదిస్తున్నారు ? నిజంగా గ్రహాంతరజీవులు ఉన్నారా ? ( U.E.O ) లు అని పిలువబడుచున్న గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనాలు చాలామందికి చాలా దేశాల్లో కనిపించిన మాట నిజమేనా ? ఏఏ కారణాలవల్ల పాశ్చాత్య ప్రభుత్వాలు గ్రహాంతరజీవుల సమాచారాన్ని ఉద్దేశ్య పూర్వకంగా తొక్కిపెడుతున్నాయి ? గ్రహాంతరజీవులతో సంబంధాలు పెట్టుకొని వారికున్న అపార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచాన్ని శాశించాలని నాడు అడాల్ఫ్ హిట్లర్ , అమెరికా ప్రయత్నించిన మాట నిజమేనా ?
వివిధరకాల అసాధారణ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈపుస్తకం నిలుస్తుంది.