అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. ఫిలడెల్ఫియాలోని Warrington Avenues లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్ళితే….

ఫిలడెల్ఫియాలోని Warrington Avenues లో సోమవారం రాత్రి 5700 బ్లాక్‌లో ఈ ఘటన జరిగిందని, ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని అక్కడి పోలీసులు తెలిపారు.

ఈ కాల్పుల్లో గాయపడిన వారిని పెన్ ప్రెస్బిటేరియన్లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు.

అయితే ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు, ఈ కాల్పులు జరిగిన వీధిని మంగళవారం తాత్కాలికంగా బ్లాక్‌ చేసినట్లు అక్కడి పోలీసులు చెప్పారు.