UKలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పీరియడ్స్ టైమ్లో నొప్పులు తట్టుకోలేక లైలా ఖాన్(16) అనే బాలిక స్నేహితుల సూచన మేరకు గర్భనిరోధక మాత్రలు వేసుకుంది.

దీంతో ఆమె తల నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతూ బాత్రూమ్లో కుప్పకూలింది. పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, బాలిక బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 13న లైలా మరణించింది.