నగరంలో రూ.500కు ఇచ్చే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ వివరాలు, గ్యాస్ బిల్లుతో వచ్చి కేవైసీ అప్డేట్ చేయించుకోవాలనే ప్రచారం జరగడంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు.

మంగళవారం కూకట్పల్లిలోని ట్రినిటీ ఇండియన్ గ్యాస్ ఆఫీసు వద్ద జరిగిన తోపులాటలో కార్యాలయ ఉద్యోగికి కన్నుపై గాయమైంది.

వాస్తవానికి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు.