మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

రాధా కుమారి అనే మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతూ గత మూడు రోజుల క్రితం మృతి చెందింది.

ఇంట్లో నివసిస్తున్న ముగ్గురికి మతిస్థిమితం లేకపోవడంతో ఆమె చనిపోయిందన్న విషయాన్ని గమనించలేదు.

మూడు రోజుల తర్వాత చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో డయల్ 100 కు కాల్ చేయగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.