2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు.

ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ఫిబ్రవరి 11న రాతపరీక్ష నిర్వహించి.. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు 180042545678 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.