వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి వారం రోజులు ఈ పథకం ఉత్సవాలు చేయనున్నారు.

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.18,750 జమ చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన.. 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు. కాపులు, ఓసీలు అర్హులు కాదు.