తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కలిసి నటిస్తున్న సినిమాకు ‘ధారావి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం.
మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ ముంబైలోని ధారావి ప్రాంతం చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నాగార్జున డాన్గా కనిపిస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.