జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతిని ఇచ్చింది.

ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేయవచ్చని కోర్టు తెలిపింది. ఇది హిందువుల అతిపెద్ద విజయం అన్నా కాశీవిశ్వనాథ్ ట్రస్టు.. వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని తెలిపింది. కాగా, కోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.