గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పదవీ బాధ్యతలు చేపట్టిన M.మురళి

గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన M.మురళి ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్. అధికారిణిని కలసి పూల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అభినందించిన అనంతరం మాట్లాడుతూ… గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ గురించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు మరియు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించే విధంగా మోటివేట్ చేయాలని తెలిపారు. గజ్వేల్ పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు వాహనదారులకు ట్రాఫిక్ నియంత్రణ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15-02-2024 వరకు రహితి ప్రకటించినందున పెండింగ్ ఉన్న వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.