యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ —- ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ కృషి

యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ జిల్లాను ఎంపిక చేయడంలో అటవీ, పర్యావరణ దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన కృషి జీవితాంతం మర్చిపోలేనిదని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు నల్గొండ రమేష్ గౌడ్ అన్నారు.

మంగళవారం రూ. 200 కోట్లతో వరంగల్ లో స్థాపించేందుకు రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఒప్పించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి వరంగల్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళి గౌడ్ నేతృత్వంలో కొండా దంపతుల అభిమానులు పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నల్గొండ రమేష్ మాట్లాడారు. వరంగల్ నగర పురోగతికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ..
వేలాదిమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్ లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా.. అందులో ఒక టెక్నికల్ సెంటర్ (హబ్) ను వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ లోని రంగశాయిపేటలో ఏర్పాటు చేసేందుకు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మంత్రి కొండా సురేఖ పట్టుదలతో విశేష కృషి చేశారన్నారు.

టెక్నికల్ సెంటర్ ఏర్పాటు వరంగల్ జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పట్టుదలతో వరంగల్లో టెక్నికల్ సెంటర్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన మంత్రి కొండా సురేఖను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా మనసారా అభినందిస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో కుండా దంపతుల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.