సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు డిమాండ్ చేశారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. బాల్క సుమన్ చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మండిపడ్డారు.

బాల్క సుమన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. తన స్థాయిని మరిచి బాల్క సుమన్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

బాల్క సుమన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.