మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా సూపర్వైజర్ పోస్టులు రెండు, మేల్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి, మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మూడు, స్టాఫ్ నర్స్ పోస్ట్ ఒకటి ఖాళీలుగా ఉన్నాయి.

ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కాలంగా ప్రబలుతున్న నూతన వైరల్ ప్రభావం ప్రభంజిస్తున్న తరుణంలో జనం జడుసుకుంటున్నారు.

ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని జనం కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రజా సమస్యలను తీర్చిదిద్దాలనికోరుతున్నారు.