గత జనవరి నెల 31 తో గ్రామపంచాయతీ సర్పంచుల పాలన కాలం గడువు ముగిసిపోయింది. దీంతో ప్రత్యేక అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించారు.

ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్లు కాని రావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఉండడం లేదు. దీంతో మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలు అన్ని వెల వెల బోతున్నాయి. గతంలో పనిచేసిన సర్పంచ్ లు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అవస్థలను ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం మారినప్పటికీ సర్పంచుల దౌర్భాగ్య పరిస్థితి నేటికి మిగిలే ఉంది.