మొగుళ్ళపల్లి. :
ఇంటింటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ఏ డి ఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్
గృహలక్ష్మి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలో మండలంలోని కరెంట్ వినియోగదారుల కనెక్షన్లన వివరాలను విద్యుత్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సేకరిస్తున్నారు.
ఈ తరుణంలో మండలంలోని వివిధ గ్రామాలలో విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరెంటు రీడర్లు చేస్తూ ,రేషన్ కార్డ్, ఆధార్ కార్డుతో విద్యుత్ కనెక్షన్ కు అనుసంధానం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏడిఈ శ్రీనివాసులు, ఏఈ అడ్డగట్ల ప్రమోద్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ లు రాజేందర్, కొమురయ్య, రఘు, స్పాట్ బిల్డర్స్ ప్రసాద్, రాజ్ కుమార్, అన్ మ్యాన్డ్స్ కిరణ్, నరేష్, అంజి, యుగంధర్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.