గజ్వేల్ :

ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా లారీ లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న డంపు చేస్తున్న లారీని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు

హైదరాబాద్ రోడ్ ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో TS 36TA 4536 గలదాని లారీ డ్రైవర్ అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రజ్ఞాపూర్ లో డంపు చేస్తున్న చేస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందితో కలిసి వెళ్లి పట్టుకొని గజ్వేల్ పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.