బాలీవుడ్లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ గురించి నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. జిమ్, ఎయిర్పోర్టుల వద్ద హీరోయిన్లు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు వెంట పడుతుండటం చూస్తూ ఉంటాం.

అయితే ఇదంతా సదరు సెలబ్రిటీలు డబ్బులిచ్చి తీయించుకుంటారని ఓ పాడ్కాస్ట్లో ప్రియమణి తెలిపారు. ‘జవాన్’ మూవీ తర్వాత ఓ ఏజెన్సీ వ్యక్తి తనను కలిసి పపరాజీ కల్చర్కి ఎంత ఖర్చవుతుందో వివరించడంతో ప్రియమణి ఆశ్చర్యపోయారట.