గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన చోటుచేసుకుంది.

పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ సౌమ్య తెలిపారు.