ఇటీవల కాలంలో ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు పెరిగిపోతున్నాయి. దీంతో మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది.
‘ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నమ్మకమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. నిత్యం బ్యాంక్ స్టేట్మెంట్లను చెక్ చేసుకుంటూ ఉండాలి. క్రెడిట్, డెబిట్ కార్డును ఉపయోగించేటప్పుడు మీ CVV, ఇతర వివరాలను బహిరంగంగా చెప్పరాదు’ అని Xలో పోస్టు చేసింది.