గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు.

అలాగే కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా వస్తారని వెల్లడించారు. రేవంత్ సీఎం హోదాలో మేడారంలో పర్యటించడం ఇదే తొలిసారి. అటు ప్రముఖుల రాక సందర్భంగా మేడారంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.