మొగుళ్ళపల్లి :

మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ బి ఐ మొగుళ్ళపల్లి బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వనదేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా..మంచినీటి సమస్య తలెత్తకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి సమస్యను తీరుస్తున్న ఎస్ బి ఐ బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ పక్షాన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ ఫీల్డ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, బ్యాంక్ సిబ్బంది ఓదెలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు, ఎండి రఫీ, యూత్ కాంగ్రెస్ మొగళ్లపల్లి మండల అధ్యక్షులు నీల రాజు కురుమ, కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.