కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తొలుత విశాఖలో వివిధ రంగాల ప్రముఖులు, విద్యా వేత్తలతో సమావేశమవుతారు. సాయంత్రం విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు.

తర్వాత ఏలూరులో ఐదు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధింత నేతలతో ఎన్నికలపై చర్చిస్తారు. కాగా రాజ్నాథ్ పర్యటనలో టీడీపీ-జనసేనతో పొత్తుపైనా చర్చిస్తారని సమాచారం.