ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యార్థినుల అదృశ్యం కేసు నమోదు అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 14 ఏళ్ల వయస్సు నుంచి 19 ఏళ్లలోపు అమ్మాయిలే అత్యధికంగా అదృశ్యం అవుతుండటం ఈ తరహా కేసులు నమోదు అవుతున్నాయి.
దాంతో పాటు వేధింపులు, కిడ్నాప్, అత్యాచారం వంటివీ చోటుచేసుకుంటుండడంతో పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా అడ్డుకట్ట పడటం లేదు.