లగేజీతో కిక్కిరిసిన రైల్లో ఎక్కడం, ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం, రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం, సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి.

కానీ, ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇంత సాధారణంగా ఉంటారని నిజం చేసి చూపిస్తోంది బాలీవుడ్ నటి సారా అలీఖాన్. ఏ మాత్రం ఖాళీ దొరికినా విహారయాత్రకు వెళ్తుంటోంది. చిన్న హోటళ్లలోనే బస చేస్తుంది. ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.