ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు.
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వెంకట్రావు కాంగ్రెస్లో చేరతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.