ఈ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను పూర్తి వివరాలను వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడక జరగనున్నట్లు పేర్కొంది. మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని వెల్లడించింది. మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ మార్చి నెలలో జరుగనున్న విశేష పర్వదినాలు, ఇతర కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి…
◼️ మార్చి 3న పల్స్ పోలియో.
◼️ మార్చి 6, 20న సర్వ ఏకాదశి.
◼️ మార్చి 8న మహాశివరాత్రి.
◼️ మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.
◼️ మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.