బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండైన వారంలో 5 రోజుల పనిదినాలు ఈ ఏడాదే సాకారం అయ్యే అవకాశం ఉంది.

ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానుంది. 5 రోజుల పని దినాలతో కస్టమర్లకు సేవలు అందించే పని గంటలు తగ్గవని, మార్పులు ఉండవని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామనకు గతంలో లేఖలో హామీ ఇచ్చింది. దీంతో పాటు జీతాల పెంపుపై కేంద్రం త్వరలో ప్రకటన చేసే ఛాన్సుంది.