YSR చేయూత నిధుల జమ కార్యక్రమాన్ని మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగే బహిరంగ సభలో CM జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద SC, ST, OBC, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేయనున్నారు.

ఆదాయపు పన్ను చెల్లించని, 3 ఎకరాల తడి భూమి/ 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు.