డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. SGT పోస్టులకు డీఎడ్ పూర్తి చేసిన వారు అర్హులు. SA ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో బీఎడ్ చేసి ఉండాలి.

PET పోస్టులకు ఇంటర్లో 50% మార్కులు, UG D.P.Ed కోర్సు చేయాలి. డిగ్రీ చేసినవారు B.P.Ed పాస్ కావాలి. బీఎడ్, డీఎడ్ చివరి ఏడాది పరీక్షలు రాసినవారూ అప్లై చేయవచ్చు. వెరిఫికేషన్ నాటికి ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. వయసు 18-46 ఏళ్ల మధ్య ఉండాలి.