తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX సినిమా కోసం ఈ లుక్లోకి మారినట్లు వెల్లడించారు. గతేడాది స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని, అప్పటి నుంచి తాను వర్కౌట్స్ చేస్తున్నట్లు ఆర్య తెలిపారు.