తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది.

భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం BJPకి ఓటు వేయాలి. మరోసారి మా విజయం ఖాయం. NDAకు 400కు పైగా సీట్లు ఇవ్వాలి. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.