తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్లు ఉపయోగించడాన్ని అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.11.5 కోట్ల వ్యయంతో జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కి.మీ దూరంలో తీహార్ గ్రామంలో ఉన్న ఈ జైలు ఆసియాలో అతిపెద్దది. గత కొన్నేళ్లలో ఇక్కడ నుంచి గ్యాంగ్ స్టర్లు ఫోన్లు వాడటం, బయటి వారిని బెదిరించడం వంటి ఘటనలు వెలుగు చూశాయి.